బాహుబ‌లి-2 ప్రీమియర్ షో ర‌ద్దు..

204
- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్ అయిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సినిమాను ప్రపంచంలోనే మొదటిసారిగా చూసే అవకాశాన్ని బాలీవుడ్ దక్కించుకుంది.

భారతీయ చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ బాహుబలి2 ప్రీమియర్‌ని ఏప్రిల్ 27నే ప్రదర్శించాలనుకున్నారు. కానీ.. ‘బాహుబలి2’ ప్రీమియర్ షోను ఇప్పుడు బాలీవుడ్‌లో రద్దు చేశారు.
 Karan Johar cancels Baahubali 2 premiere as ...
కేన్సర్‌తో బాధ‌ప‌డుతూ కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ న‌టుడు, నిర్మాత వినోద్ ఖన్నా ఈ రోజు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.

అయితే, ఈ రోజు రాత్రి ప్ర‌ద‌ర్శింప‌త‌ల‌పెట్టిన బాహుబ‌లి-2 ప్రీమియర్ షోను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఈ రోజు మ‌ధ్యాహ్నం బాలీవుడ్ నటుడు, దర్శకుడు క‌ర‌ణ్ జొహార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. బాహుబ‌లి టీమ్ అంతా వినోద్ ఖ‌న్నా మృతి ప‌ట్ల సంతాపం తెలుపుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, ఈ బెనిఫిట్ షోను బాలీవుడ్‌లో మాత్ర‌మే ర‌ద్దు చేస్తారా? లేదా అన్ని భాష‌ల్లోనూ ర‌ద్దు చేస్తారా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు.

 Karan Johar cancels Baahubali 2 premiere as ...

- Advertisement -