ధోనితో కోహ్లీని పోల్చకండి..!

4
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన కామెంట్స్ చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని టీమ్‌లో కొనసాగించడం వృథా అంటూ విమర్శలు వచ్చాయి. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించాడు కోహ్లీ.

ఈ నేపథ్యంలో కోహ్లీని ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ గా కీర్తిస్తూ కామెంట్లు చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఇన్నేళ్లు ఆడిన తర్వాత కూడా మ్యాచ్‌లు గెలిపించాలనే అతని కసి ఓ అద్భుతం.. అతనికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నారు.

క్రికెట్ చరిత్రలో చాలా తక్కువమంది మాత్రం విరాట్ కోహ్లీలా ఆకలితో ఆడేవాళ్లు. అతనిలో ఎంతో టాలెంట్ ఉంది. అతనికి ముందు మ్యాచులను ఎలా గెలిపించాలనే విషయంలో అతనికి ఓ క్లాస్ ఉందని ప్రశంసలు గుప్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ధోనీ ఇంతకుముందు ఇలాగే మ్యాచులు గెలిపించేవాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ విషయంలో మిగిలినవారి కంటే ముందే ఉన్నాడు.. అందుకే విరాట్ కోహ్లీని పోల్చాలంటే సచిన్ టెండూల్కర్, వీవిన్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్‌లతో మాత్రమే పోల్చాలి అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Also Read:మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

- Advertisement -