ఆప్ అవినీతిని వెల్లడిస్తూ కుప్పకూలిన కపిల్‌..

189
Kapil Mishra's Big expose:
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.2 కోట్లు లంచం తీసుకుంటుండగా తాను చూశానంటూ ఆప్ బహుష్కృత నేత కపిల్ మిశ్రా సంచనల ఆరోపణలు చేయడంతో ఆప్‌లో కల్లోలం మొదలైన విషయం తెలిసిందే. తాజాగా కపిల్‌ మిశ్రా నేడు మరోసారి కేజ్రీవాల్ అవినీతి బాగోతాలను బయటపెట్టాడు. స్పైరల్ బైండింగ్ చేసిన పుస్తకాలను చూపించిన మిశ్రా.. సంచలన ఆరోపణలు చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన నిధులను కేజ్రీవాల్ ఎలా వాడుకున్నారో.. బ్లాక్ మనీని యాక్సిస్ బ్యాంకు ద్వారా వైట్ మనీగా కేజ్రీ ఎలా మార్చుకున్నారో మిశ్రా వెల్లండించారు. పార్టీకి రూ. 25 కోట్లు విరాళంగా వస్తే, రూ. 20 కోట్లను లెక్కలోకి చూపి, రూ. 5 కోట్లను ఆయన నొక్కేశారని చెప్పారు. మిగతా డబ్బులో రూ. 15 కోట్ల మొత్తాన్ని కూడా ఆయన స్వీయ అవసరాలకు, నేతల విదేశీ పర్యటనలకూ వాడారని చెప్పారు. ప్రతి ఖాతాలకు సంబంధించిన బ్యాంకు వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఎలక్షన్ కమిషన్ తో పాటు, సీబీఐ, ఏసీబీ అధికారులకు ఇవ్వనున్నానని వెల్లడించారు. వందలాది కంపెనీల్లో కేజ్రీవాల్ కు చట్ట విరుద్ధమైన వాటాలు ఉన్నాయని, ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల మొత్తాలున్నాయని అన్నారు. కేజ్రీవాల్ ప్రారంభించిన షెల్ కంపెనీల వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని అన్నారు.

appaccounts

ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుడు లెక్కలు సమర్పించిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలను చూపారు. ఆప్ నేతలకు అడ్డదారుల్లో విరాళాలు అందాయన్నారు. 16 డొల్ల కంపెనీల ద్వారా ఆప్ నేతల ఖాతాల్లోకి డబ్బులు చేరాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కపిల్ మిశ్రా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సహచరులు ఆయన హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ఆయన్ను పరీశీలించిన వైద్యులు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయిందని నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.

- Advertisement -