కంటి చూపు సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వం తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.
ఇప్పటివరకు మొత్తం కోటి 52 లక్షల 74 వేల 440 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 22 లక్షల 70 వేల 534 మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 17 లక్షల 92 వేల 169 మందికి ప్రత్యేక అద్దాలు ప్రతిపాదించారు. శస్త్రచికిత్సల కోసం 9 లక్షల 23 వేల 618 మందిని రిఫర్ చేశారు.
9 వేల 524 గ్రామాలు 842 మున్సిపల్ వార్డుల్లో కంటిపరీక్షల నిర్వహణ పూర్తయ్యింది. జిల్లాల వారీగా చూస్తే సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 9 లక్షల 87 వేల 390 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో లక్షా 16 వేల 719 మందికి కండ్లద్దాలు అందజేశారు. శస్త్ర చికిత్సలకు 47 వేల 290 మందిని రిఫర్ చేశారు.
భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల 48 వేల 592 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 60 వేల 107 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. శస్త్ర చికిత్స కోసం 15 వేల 718 మందిని రిఫర్ చేశారు.
వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల 15 వేల 815 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 37 వేల 895 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 214 గ్రామాలకు గాను 209 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తయ్యాయి. వనపర్తి జిల్లాలో ఐదు గ్రామాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.