ఆ స్టార్ హీరో భార్యకి పెన్షనే ఆధారం

422
kantharao
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘన విజయాన్ని సొంతం చేసుకోగా ప్రస్తుతం ఎన్టీఆర్,వైఎస్సార్ బయోపిక్‌ తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న వైఎస్ బయోపిక్‌కి యాత్ర అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఎన్టీఆర్,ఏఎన్‌ఆర్‌లతో సమానంగా వెలుగొందిన కత్తి వీరుడు కాంతారావు జీవిత చరిత్ర తెరపైకి రానుంది. చంద్రాదిత్య ఫిల్మ్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో కాంతారావు బయోపిక్‌ను దర్శకుడు డాక్టర్‌ పి.సి.ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.

 kantha rao

శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆదిత్య తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం కాంతారావు సొంత ఊరు వెళ్లి మరీ బోలెడంత రీసెర్చ్ చేశారు. ఈ సినిమాకు రాకుమారుడు అనే టైటిల్‌ని ఖరారు చేశారు. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పరిశోధనలో ఆయన వ్యక్తిత్వం గురించి తెలిశాక ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడం ఆనందాన్నిస్తోందని అన్నారు. కాంతారావు జీవిత చరమాంకంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఓ గుణపాఠం అని తెలిపారు . కాంతారావు కొడుకు రాజా తన తల్లి హైమావతితో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే రాజా చదువుకోలేదు.. ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం 10000 పెన్షన్ ఈ కుటుంబానికి ఇస్తోంది. అందులో రూ.6000 వరకూ ఇంటికి అద్దె కడుతున్నారని తెలిపారు. మొత్తంగా రాకుమారుడుపై టీ టౌన్‌ ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.

- Advertisement -