- Advertisement -
రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా సప్తమి హీరోయిన్‌గా నటించిన చిత్రం కాంతార. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అన్ని భాషల్లోనూ భారీ వసూళ్లను రాబట్టగా ఇటీవల తెలుగులో విడుదలై సంచలన విజయాన్ని నమోదుచేసింది. దాదాపు అన్ని భాషల్లో కలిపి రూ. 250 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు సమాచారం.
ఒక్క తెలుగు వెర్షన్ నుంచే ఇప్పటికే 18 కోట్లకు పైగా షేర్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కాంతార ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చూస్తున్న వారికి షాక్ తగిలింది.తొలుత కాంతార డిజిటల్ ప్రీమియర్ నవంబర్ 4 లేదా 5న ఉండొచ్చని టాక్ వినిపించిన అది లేనట్టు తెలుస్తోంది. కాంతార ఓటీటీ డేట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మాత విజయ్ కిర్గన్ దూర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సమంతకు అరుదైన వ్యాధి
కర్ణాటక అసెంబ్లీకి యంగ్ టైగర్
జెర్సీ హీరో పెళ్లి.. వధువు ఎవరంటే ?
- Advertisement -