కాంతార చాప్టర్ 1..ట్రైలర్ వచ్చేసింది

10
- Advertisement -

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజువల్‌ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమాటోగ్రఫీని అర్వింద్ ఎస్. కాశ్యప్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన బి. అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నారు. హోంబాలే ఫిలిమ్స్‌ విజయ్ కిరగందూర్ నెక్స్ట్ లెవల్ లో నిర్మిస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్ లో అక్టోబర్ 2, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న కాంతార 1 ట్రైలర్ వచ్చేసింది. నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు ? అంటూ మొదలైంది. మెయిన్ గా ఈ ట్రైలర్.. గ్రాండ్ విజువల్స్ తో పాటు షార్ప్ షాట్స్ అండ్ సాలిడ్ బిజీఎమ్ తో చాలా బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా ట్రైలర్ లో ఇచ్చిన నేటివిటీ టచ్ అండ్ ఎమోషన్ కూడా చాలా బాగుంది. 2 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్థాయిలోనే చాలా బాగుంది. ఉత్కంఠను కలిగించే విధంగా ప్రతి షాట్ సాగింది. దీనికి తోడు మేకింగ్ స్టైల్ అండ్ మెయిన్ కంటెంట్ కూడా ఆకట్టుకున్నాయి. తెలుగులో గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అవుతుండగా, నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది.

Also Read:సింగరేణి కార్మికులకు 34 శాతం బోనస్

- Advertisement -