ఓటీటీలోకి ‘కాంతార చాప్టర్ 1’

9
- Advertisement -

రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ తో కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. కాంతార: చాప్టర్ 1 విజువల్ వండర్ గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. ప్రేక్షకులు విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.

కాంతార: చాప్టర్ 1 తెలుగులో 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసింది. కన్నడ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతరకి ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార: చాప్టర్ 1 ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది.

ఈ నెల 31 నుంచి ఓటీటీలో ‘కాంతార: చాప్టర్ 1’ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

Also Read:‘మొంథా’ ఎఫెక్ట్..54 రైళ్లు రద్దు

- Advertisement -