చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించిన సినిమా కాంతార. శాండల్వుడ్‌లో విడుదలై అనతి కాలంలో పాన్ ఇండియా లెవల్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాపై ప్రీక్వెల్ ఉంటుందని ఇదివరకే దర్శకుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ తలైవా నటిస్తున్నారని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవలే ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్ శెట్టిని ఈ విషయం గురించి అడగ్గా…ఆయన మౌనంగా వెళ్లిపోయారట. దీంతో ఈ వార్తపై నిజమేననుకుంటున్నారు. ఇది రూమర్ అయితే రిషబ్ స్పందించేవారని…కావున ఏం చెప్పలేదంటే కాంతార2లో తలైవా నటించడం ఖాయమని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హిట్ చిత్రంలో సూపర్ స్టార్ అంటూ ఇమెజ్‌లు పోస్టులు చేస్తున్నారు.
అయితే రజినీకాంత్ కూడా గతంలో రిషబ్‌ను తన ఇంటికి పిలిచి సన్మానించి బహుమతి ఇచ్చారు. కాంతార సినిమా తనకెంతో నచ్చిందని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతేకాదు సందర్భం వచ్చినప్పుడుల్లా కాంతార సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరీ వేచి చూడాలి. తలైవా ఇందులో నటిస్తున్నారో లేదో మరీ వేచి చూడాలి. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే యేడాదిలో పాన్ ఇండియా స్థాయిలో దీనిని విడుదల చేస్తామని హోంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి…