- Advertisement -
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సెకండ్ టీజర్‌ని రిలీజ్ చేశారు. తమ గూడెంల మీద శత్రు సైన్యం దండెత్తి వస్తున్న సమయంలో వారిని కాపాడే నాస్తికుడు అయిన తిన్నడు పాత్రలో మంచు విష్ణు కనిపించాడు. అక్షయ్ కుమార్ మహాశివునిగా, కాజల్ పార్వతిగా అద్భుతంగా కనిపిస్తుండగా వారిపై డైలాగ్స్ మరింత ఆసక్తిని పెంచాయని చెప్పవచ్చు. మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ అందరినీ టీజర్ లో చూపించారు.
- Advertisement -