Kannappa:హార్డ్ డ్రైవ్‌లో ప్రభాస్ సీన్లు

5
- Advertisement -

మిస్ అయిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఆ హార్డ్ డ్రైవ్‌లో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభాస్ యాక్షన్ సీన్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. హార్డ్ డ్రైవ్ బ్యాకప్ పెట్టుకున్న కూడా.. ఎవరైనా ఆన్‌లైన్‌లో లీక్ చేస్తే ఎలా అని ఆందోళన పడుతుంది చిత్రబృందం.

కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌తో ఇద్దరు వ్యక్తులు పరారీ అయిన సంగతి తెలిసిందే. కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను, ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా పంపింది ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్.

ఆ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని తెలిపింది ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ.కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ.

Also Read:థియేటర్లు..పవన్ కీలక సూచన

- Advertisement -