శాతకర్ణిలో కన్నడ సూపర్ స్టార్

237
Kannada Super Star Shivaraj Kumar
- Advertisement -

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్‌కు ఉన్న క్రేజ్‌గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వంద చిత్రాల‌కుపైగా న‌టించి క‌న్న‌డ అభిమానుల గుండెల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ క‌న్న‌డ కంఠీర‌వ పార్వ‌త‌మ్మ పుత్త శివ‌రాజ్‌కుమార్ తొలిసారిగా న‌ట సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో అతిథి పాత్ర‌లో న‌టిచారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ఇంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రంలో శివ‌రాజ్‌కుమార్ న‌టించడం సినిమాకు మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. శివ‌రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు కానుక‌గా ఈ సినిమాలో శివ‌రాజ్‌కుమార్ ఫ‌స్ట్‌లుక్‌ను నేడు ఆయ‌న త‌ల్లి పార్వ‌త‌మ్మ పుట్టిన‌రోజు కానుక‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబు మాట్లాడుతూ – “క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్‌గారు మా సినిమాలో న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగువారి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే శాత‌క‌ర్ణి చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌గారిపై అభిమానంతో శివ‌రాజ్‌కుమార్‌గారు అతిథిపాత్ర‌లోన‌టించ‌డానికి ఒప్పుకున్న శివ‌రాజ్‌కుమార్‌గారికి థాంక్స్‌. లెజెండ్రీ న‌టుడు రాజ్‌కుమార్ ఫ్యామిలీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఇత‌ర భాషా చిత్రాల్లో న‌టించ‌లేదు. తొలిసారి శివ‌రాజ్‌కుమార్ తెలుగులో న‌టించ‌డం విశేషం.

నేడు శివ‌రాజ్‌కుమార్‌గారి త‌ల్లి పార్వ‌తమ్మ‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గౌతమిపుత్ర శాత‌క‌ర్ణిలో శివ‌రాజ్‌కుమార్‌ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్నాం. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఆడియో వేడుకను డిసెంబ‌ర్ 16న తిరుప‌తిలో గ్రాండ్‌గా నిర్వ‌హిస్తున్నాం“ అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

- Advertisement -