- Advertisement -
కన్నడ మాట్లాడను.. హిందీ లోనే మాట్లాడుతా అంటూ కర్ణాటకలో SBI బ్యాంకులో మహిళా మేనేజర్ రచ్చ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా స్వయంగా స్పందించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య.
బెంగళూరులోని సూర్యనగరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కస్టమర్‌తో గొడవ పడింది మహిళా మేనేజర్. తాను హిందీలో మాట్లాడుతానని.. స్థానిక భాష అయిన కన్నడలో మాట్లాడనంటూ రచ్చ రచ్చ చేసింది.
దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. బ్యాంక్ మేనేజర్ కస్టమర్లతో ఇలా మాట్లాడడం సరికాదు అన్నారు. స్థానిక భాషలను గౌరవిస్తూ వాటిల్లోనే మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచించారు.
Also Read:కాంగ్రెస్ హోంమంత్రిపై ఈడీ దాడులు
- Advertisement -

