చరణ్ తేజ్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నేను లోకల్ చిత్ర దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన స్టోరి, దర్శకత్వ పర్యవేక్షణలో, ప్రముఖ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఆయష్మాన్‌భవ. సి టి.ఎఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తోంది. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కథనం తో రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ లో బేబి డాళ్, హ్యాంగ్ ఓవర్, హై హీల్స్ లాంటి సూపర్బ్ సాంగ్స్ కంపోజ్ చేసిన మీట్ బ్రోస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రముఖ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ చరణ్ తేజ్ సరసన నటిస్తోంది. అటు సింగర్ గా.. ఇటు హీరోయిన్ గా పలు సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న… ఆండ్రియా.. ఆయుష్మాన్ భవ చిత్రంలో పాప్ సింగర్ జెన్నిఫర్ క్యారెక్టర్ లో కీలక పాత్ర పోషిస్తోంది. హుజాన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ బ్యూటీ రన్యా రావ్ ఆయుష్మాన్ భవ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మోడ్రన్ సావిత్రిగా కనిపించనుంది. గతంలో కన్నడ భాషలో సుదీప్ సరసన, తమిళంలో విక్రమ్ ప్రభు సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటికే విడుదల చేసిన ఆయుష్మాన్ భవ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా చరణ్ తేజ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రానికి ఇంత మంచి కథ ని అందించటమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సూపర్ సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన గారికి, స్క్రీన్‌ప్లే అందించిన ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ కి నా ధన్యవాదాలు. అలాగే క్రేజీ డైరెక్టర్ మారుతి గారు మా చిత్రానికి సహనిర్మాతగా బాధ్యతలు స్వీకరించారు. మా చిత్రం లో హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశాము. పాప్ సింగర్ జెన్నిఫర్ క్యారెక్టర్ లో ఆండ్రియా.. కీలక పాత్ర పోషిస్తోంది. మరో హీరోయిన్ హుజాన్ కు చాలా మంచి పేరు తీసుకొచ్చే క్యారెక్టర్ ప్లే చేస్తోంది. కన్నడ బ్యూటీ రన్యా రావ్ మోడ్రన్ సావిత్రిగా డిఫరెంట్ క్యారెక్టర్ పోషించింది.
సినిమాలో చాలా కీలకమైన పాత్ర ఇది. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మీట్ బ్రోస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే.. మర్చిపోవాలా.. పారిపోవాలా.. చచ్చిపోవాలా.. ప్రపంచం ఏమైతే నాకేంటి…. సమాజం ప్రేమని చూసే విధానం మారాలి… లేకపోతే చంపేస్తా .. అనుకునే హీరో క్యారక్టరైజేషన్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ కోసం బీమ్స్ సిసిరోలియో అందించిన రీ రికార్డింగ్ గురించి ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాము అని అన్నారు.
నటీనటులు.. చరణ్‌తేజ్, స్నేహ ఉల్లాల్, ఆండ్రియా, రన్యా రావ్, హుజన్, పరుచూరి వెంకటేశ్వ రావు, రంగరాజన్, అశ్విన్, నిఖిత తదితరులు,టైటిల్.. ఆయుష్మాన్ భవ,ప్రోడక్షన్ హౌస్ అండ్ ప్రోడ్యూసర్.. సి.టి.ఎఫ్,సహ-నిర్మాత.. మారుతి,అసోసియెట్ ప్రోడ్యూసర్.. బి.ఏ.శ్రీనివాసరావు , హేమ రత్న,కథ-దర్శకత్వ పర్యవేక్షణ.. త్రినాథ్ రావు నక్కిన,కథనం.. పరుచూరి బ్రదర్స్,సంగీతం- మీట్ బ్రోస్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్– బీన్స్ సిసిరోలియో,పి.ఆర్.ఓ- ఏలూరు శ్రీను,కెమెరా.. దాసరధి శివేంద్ర,ఆర్ట్- పి.ఎస్.వర్మ,కాస్ట్యూమ్స్- పొట్ట హరిక,దర్శకత్వం- చరణ్ తేజ్