సింగర్‌గా మారిన విజయ్‌ దేవరకొండ..!

225
Vijay Devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘గీత గోవిందం’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజయ్‌కి జంటగా రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే.. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగానే కాకుండ సింగర్‌గా కూడా అందరిని ఆకట్టుకున్నాడు. విజయ్‌ ఈ సినిమాలో ఒక పాట పాడాడు.

Vijay Deverakonda

తాజాగా ఈ మూవీ నుండి విజయ్ దేవరకొండ రికార్డింగ్ థియేటర్‌లో పాట పాడుతూ వున్నప్పటి వీడియోతో కూడిన లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. “అమెరికా గాళ్ అయినా . . అత్తిలి గాళ్ అయినా .. యూరప్ గాళ్ అయినా .. యానాం గాళ్ అయినా” అంటూ ఈ పాట జోరుగా సాగింది. ‘అమ్మాయంటేనే టఫ్ఫు .. వాళ్ల తిక్కకి మనమే స్టఫ్ఫు .. దానికి నేనే ప్రూఫు ..’ అంటూ అమ్మాయిల ధోరణిని ప్రస్తావిస్తూ ఈ పాట పాడాడు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటకు గోపీసుందర్ సంగీతం అందించాడు. ఈ పాట యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలావుంది.

https://youtu.be/hPRaM6OEHJ4

- Advertisement -