గుండెపోటుతో కన్నడ నటుడు మృతి

5
- Advertisement -

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం స్వల్ప అస్వస్థతకు గురైన దిలీప్ రాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

దిలీప్ రాజ్ కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అనేక టీవీ సీరియల్స్ మరియు సినిమాల్లో నటించారు.

కన్నడ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ‘హిట్ లర్ కళ్యాణ’ వంటి సీరియల్స్‌లో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆయన నిర్మాణ సంస్థ ద్వారా అనేక మంది నూతన నటీనటులను పరిశ్రమకు పరిచయం చేశారు.

దిలీప్ రాజ్ మరణవార్త విన్న కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read:సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్!

- Advertisement -