కంగనాకు సారీ చెప్పిన సైఫ్‌..

209
- Advertisement -

సైఫ్‌ అలీ ఖాన్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైర్‌ అయింది. దీనికి కారణం ఆర్టిస్టులను సైఫ్‌ అలీఖాన్‌ రేసుగుర్రాలతో పోల్చడమే. ఐఫా అవార్డు వేడుకల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సైఫ్‌.. నెపోటిజం(బంధుప్రీతి)పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

  Kangna Ranaut calls out Karan's nepotism; Saif

దీంతో.. కంగనా.. సైఫ్‌కి ఓ లేఖ రాసింది. ‘ఆర్టిస్ట్‌లను రేసు గుర్రాలతో ఎలా పోలుస్తారు.  అంటే ఆర్టిస్ట్‌లకు ఉండే నైపుణ్యాలు, వారు పడే శ్రమ, అనుభవం, ఏకాగ్రత, ఆతృత, ప్రేమాభిమానాలు కుటుంబీకుల నుంచే అలవడుతాయన్నది మీ అభిప్రాయమా? అదే నిజమైతే మరి నేను రైతు అవ్వాలి కదా? నా జీవితంలో నా కలలు నిజం చేసుకోవడం ఎవరి జీన్స్‌ నుంచి వచ్చాయో?’ అని కంగనా సైఫ్‌కి రాసిన లేఖలో ప్రశ్నించింది.

 Kangna Ranaut calls out Karan's nepotism; Saif

దీంతో కంగనా లేఖకు సైఫ్‌ సారీ చెప్పక తప్పలేదు. తాను చేసినటువంటి వ్యాఖ్యలపై సైఫ్‌.. కంగనాను క్షమాపణ కోరుతూ లేఖ రాశాడు. ఇదిలా ఉండగా..బాలీవుడ్‌ లో బంధుప్రీతి విషయం గురించి మొదటగా ప్రస్తావించింది కంగనానే.

అప్పటి నుంచి ఈ విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కంగనా.. ‘మణికర్ణిక- ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సి’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఇటీవల కంగనా ముఖానికి తీవ్ర కత్తి గాయమైన విషయం తెలిసిందే.

- Advertisement -