ఎన్టీఆర్ పార్టీ ఇదే..!

207
jr ntr's sama samaj party
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జై ల‌వకుశ‌. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా సినిమా సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఎన్టీఆర్‌ సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. ఇందులో ఎన్టీఆర్ మెస్మ‌రైజింగ్ లుక్ తో క‌నిపించి ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

ntr-sam1

ఈ సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ బయటకు రాగా, ‘సమ సమాజ్ పార్టీ’ పేరిట ఎన్టీఆర్ ఫోటోతో కూడిన జెండాలు, బ్యానర్లు కట్టిన జీపులు, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రచారం దృశ్యాలు ఉన్నాయి. పార్టీ గుర్తు పాల క్యాన్. ఇక బ్యానర్లపై అక్షరాలు ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉండటంతో ఇది ఉత్తర భారతదేశంలోని ఓ ప్రాంతానికి చెందిన పాత్రగా కథలో భాగమై ఉండవచ్చని సమాచారం. ఇక ఈ నెలాఖరున రెండవ టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే డేట్ చెప్పనున్నారట. ఈ సారి ‘లవ’ పాత్రకి సంబంధించిన టీజర్ ను వదులుతారని తెలుస్తోంది. ఈ పాత్రలో ఎన్టీఆర్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని అంటున్నారు. మొదటి టీజర్ కి మించి రెండవ టీజర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. రాశిఖన్నా .. నివేదా థామస్ .. నందితా రాజ్ కథానాయికలుగా నటిస్తోన్నారు.

ntr-sam3

- Advertisement -