మాజీ మంత్రికి కంగనా వార్నింగ్‌..!

24

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి సుఖ్ దేవ్ పన్సేను లక్ష్యంగా చేసుకుని నటి కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎముకలు విరగ్గొడతానని వార్నింగ్ ఇచ్చారు. తానేమీ వయ్యారాలు వలికించే యువతిని కాదని, రాజపుత్ వంశానికి చెందినదాన్నని ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇంతకీ వారిద్దరి మధ్యా ఏం జరిగింది? అంత ఘాటుగా కంగనా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే, కొన్ని రోజుల క్రితం సుఖ్ దేవ్ ఏమన్నారో తెలుసుకోవాలి.

ఇటీవల మీడియాతో మాట్లాడిన సుఖ్ దేవ్, కంగన గురించి మాట్లాడుతూ, ఆమె ఓ రికార్డింగ్ డ్యాన్సర్ అనే మీనింగ్ వచ్చేలా కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో కంగన స్పందించారు. తానేమీ ఆలియా భట్, దీపికా వంటి హీరోయిన్ ను కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఏ సినిమాలోనూ ఐటమ్ సాంగ్స్ చేయలేదని, ఐటమ్ సాంగ్స్ చేయని ఏకైక హీరోయిన్ ను తానేనని అన్నారు. గతంలో ఎన్నో పెద్ద పెద్ద హీరోల సినిమాలను కూడా వద్దనుకున్నానని, అందుకనే బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరో హీరోయిన్లు, ఇతర నటీ నటులు తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కంగనా రనౌత్ ఇప్పుడు బాలీవుడ్‌లో సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తోంది. ఆమెకంటూ అక్కడ వర్గం తయారైంది. ఆ వర్గంలోని వాళ్లు మాత్రమే ఆమెతో సినిమాలు చేస్తారు. మిగతా వాళ్లందరూ ఆమెకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్లో టాప్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు చాలా వరకు కంగనాకు దూరమే. ఎందుకంటే ఆమెతో పని చేస్తే ఎప్పుడే వివాదంలో చిక్కుకుంటామో.. తమ మీద ఏం ఆరోపణలు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.