ప్చ్.. కంగనా ఇంకెప్పటికీ మారుతుందో !

54
- Advertisement -

కంగనా రనౌత్ కి సహజంగానే పైత్యం ఎక్కువ. దీనికితోడు ఏరు దాటాక తెప్ప తగలేసే బ్యాచ్ లో కంగనాది మొదటి ప్లేస్. నిజానికి బాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువగా ఈ కోవకు చెందిన వారే. కానీ, వీరిలో కంగనా రనౌత్ స్టైల్ వేరు. ఎప్పుడో దాటిన ఏరు దగ్గరకు మళ్లీ మళ్లీ వెళ్లి మరీ తెప్ప తగిలేస్తూ ఉంటుంది. హిందీ దర్శకనిర్మాతలు మరియు హీరోల ద్వారా డబ్బు బాగా సంపాదించి ఆ తర్వాత కొన్నాళ్ళకు వారినే చులకన చేసి మాట్లాడే అలవాటు కంగనా రనౌత్ కి బాగా ఉంది.

ఇంతకుముందు పలువురు హీరోలను దర్శకనిర్మాతలును కంగనా రనౌత్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన విధానం చూశాం. తాజాగా కంగనా రనౌత్ మళ్లీ రెచ్చి పోయింది. బాలీవుడ్ లో నీచులు ఎక్కువైపోయారు అని వారంతా తన పై విషం కక్కుతూనే ఉన్నారని కంగనా అభిప్రాయ పడింది. పైగా హిందీ చిత్రసీమలో తన టాలెంటుని ఎవరూ గుర్తించడం లేదు అని కూడా కంగనా రనౌత్ చెప్పడం విశేషం. ఆమెలోని నటిని అక్కడి ఫిల్మ్ మేకర్స్ గుర్తించలేదంట. ఆమెకు నటించే పాత్రలు ఇవ్వకుండా రొటీన్ గ్లామర్ పాత్రలు ఇచ్చారని కంగనా రనౌత్ విమర్శించింది.

Also Read: Arya:ఆర్య-గౌతమ్ కార్తీక్ “మిస్టర్ X”

సరే.. కంగనా రనౌత్ కి ఆ పాత్రలు నచ్చలేదు అనుకుందాం. మరి ఎందుకు చేసింది ?, నిజంగా ఆమెకి ఆ రోల్స్ నచ్చకపోతే చెయ్యకుండా ఉండాల్సింది. కంగనా రనౌత్ ని ఎవరూ బలవంతంగా ఆ పాత్రల్లో నటింపచెయ్యలేదు కదా. అప్పుడు అందాల ప్రదర్శనకైనా రెడీ అని డబ్బులు వెనకేసుకొంది. ఇప్పుడు బాలీవుడ్ లో సోలోగా కాస్త గుర్తింపు రాగానే ఛాన్స్ లు ఇచ్చిన వారి పైనే చులకనగా మాట్లాడుతోంది. ఏమిటో కంగనా ఇంకెప్పటికీ మారుతుందో !

Also Read: ‘ఎన్టీఆర్ 30’కి అతని కొట్టుడు నచ్చట్లేదు

- Advertisement -