హాలీవుడ్‌లోకి కంగనా!

17
- Advertisement -

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. హాలీవుడ్ హార్రర్ మూవీ బ్లెస్డ్‌ బీ ద ఈవిల్‌ చిత్రంలో కంగనా నటించనుండగా ఇది ఆమె డెబ్యూ హాలీవుడ్ సినిమా కానుంది.

స్కార్లెట్‌ రోజ స్టాలోన్‌తో కలిసి కంగనా ఆ చిత్రంలో తన పాత్రను పోషించనున్నది. ఈ సినిమాలో టీన్‌ వోల్ఫ్‌ నటుడు టైలర్‌ పోసే కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనురాగ్‌ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

స్క్రీన్‌ ప్లే గాథ తివారీ. ఈ చిత్రాన్ని ఇద్దరు కలిసి ప్రొడ్యూస్‌ చేయనున్నారు. హారర్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఈ వేసవిలోనే షూటింగ్‌ ప్రారంభంకానున్నది. ఈ సినిమా మొత్తం అమెరికాలోనే షూట్ చేయనున్నారు.

Also Read:మంచు మనోజ్…దూకుడు!

- Advertisement -