ఓటీటీలోకి కంగనా తేజస్!

71
tejas
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించిన తేజస్ నేరుగా ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ పాత్రలో కంగనా కనిపించనుండగా సర్వేష్‌ మెవారా దర్శకత్వం వహించారు. ఇటీవలె కంగనా నటించిన ‘ధాకద్‌’ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో తేజస్ సినిమా మేకర్స్ సందిగ్దంలో పడ్డారట.

ఈ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దాదాపు 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ‘ధాకద్‌’ కనీసం 10 కోట్ల రూపాయల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దాంతో దర్శక నిర్మాతలు భయపడుతున్నారు.

మరో సర్‌ప్రైజ్‌ను మేం తట్టుకునే స్థితిలో తాము లేమని అందుకే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -