ఆ డైరెక్టర్ భార్య పై కంగనా ఫైర్

30
- Advertisement -

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ’12th ఫెయిల్’ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా భార్య అనుపమ చోప్రాపై ఆమె మండిపడ్డారు. అనుపమ లాంటి వాళ్లు ఇండస్ట్రీకి ప్రమాదకరమని అన్నారు. ఆమె తన భర్త ఫేమ్ వాడుకొని క్రిటిక్ గా చలామణి అవుతున్నారన్నారు. ఆమె నిజమైన టాలెంట్ ఉన్నవారిని ఇండస్ట్రీకి రాకుండా బాలీవుడ్ గాసిప్ గ్యాంగ్ తో కలిసి పనిచేస్తున్నారని అన్నారు. అసలు కంగనా ఈ హాట్ కామెంట్స్ ఎందుకు చేసింది అంటే.. ’12th ఫెయిల్’ సినిమా చూడడానికి థియేటర్స్‌కు ఎవరూ రారని తన భార్య, ప్రముఖ సినీ క్రిటిక్ అనుపమ చోప్రా చెప్పిందని దర్శకుడు విధు వినోద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

దీంతో, కంగనా మాట్లాడుతూ.. ”ఆమెకు (అనుపమ) తెలివైన అమ్మాయిలు అంటే జెలసీ, తన భర్తని కూడా చూసి అసూయపడడం పెద్ద ఆశ్చర్యం కాదులే” అని దీనిపై కంగనా స్పందించింది. మొత్తానికి ’12th ఫెయిల్’ దర్శకుడి భార్యపై కంగనా విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కంగనా తీరుపై ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది కేసు పెట్టారు. మీడియాను, జనాలను తప్పుదోవ పట్టించడంలో.. అలాగే ప్రముఖుల పై అసత్య ప్రచారాలు చేయడంలో కంగనా ముందు ఉంటుంది అని ఆయన ఆరోపించారు.

గతంలో కంగనా రనౌత్ చేసిన పలు కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, కంగనా అంశంపై సినీతారలు కూడా అప్పట్లో బాగా నెగిటివ్ గా స్పందించారు. హిందీ చిత్రసీమకు పట్టిన వైరస్ కంగనా అంటూ ఆమె పై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, కంగనా మాత్రం తనదైన శైలిలోనే ముందుకు వెళ్తుంది.

Also Read:KCR:ఆట ఆరంభం..కే‌సి‌ఆర్ ఎంట్రీ!

- Advertisement -