కొత్త బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పిన కంగనా..!

243
- Advertisement -

బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటనలో జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అయితే పురస్కారాలు అందుకోవడమే కాదు వివాదాలతో వార్తల్లో ఉండటం కూడా ఆమెకు అలవాటే. ఇప్పటికే రియల్ లైఫ్‌లో బోలెడు ప్రేమకథల్ని నడిపి బ్రేకప్‌‌లతో రచ్చ చేసిన ఈ మణికర్ణిక మళ్లీ ఇప్పుడు కొత్త ప్రేమ కథకు బాటలు వేసుకుందట. తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని కంగనా షాకిచ్చింది. ఇటీవ‌ల ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి పలు సంచలన విషయాలు వెల్లడించింది.

Kangana Ranaut

ప్ర‌స్తుతం తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని.. ప్రేమ విష‌యంలో త‌న‌కి ఎన్నో చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని పేర్కొంది. నేను ప్రేమ‌లో లేని రోజు లేదు. జీవితంలో ఎదురైన చేదు అనుభ‌వాల‌ నుండి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్న నాకు స్పూర్తిగా నిలిచే వ్య‌క్తి తోడుగా కావాల‌ని ఉంద‌ని కంగ‌నా పేర్కొంది. 20 ఏళ్ల క్రితం రిలేష‌న్స్ ప‌ట్ల ఎన్నో ర‌కాల ఆలోచ‌న‌లు ఉండేవి. కాని ఇప్పుడు ఎవ‌రి కోసం పాకులాడ‌ద‌ల‌చుకోలేదు అంటూ కంగ‌నా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

అయితే తాను ప్రేమ‌లో ఉన్న వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యాన్ని చెప్ప‌కుండా ప్ర‌స్తుతానికి సస్పెన్స్‌లో పెట్టింది ఈ బాలీవుడ్ భామ‌. క‌ర‌ణ్ జోహార్‌, హృతిక్ రోష‌న్‌పై కూడా కంగ‌నా మరోపసారి ఈ ఇంట‌ర్వ్యూలో స్పందించింది. నా స్థానాన్ని వారు ఎప్ప‌టికి అందుకోలేరంటూ ప‌లు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కంగనా ‘మెంటల్ హై క్యా’ చిత్రంతో బిజీగా ఉంది.

- Advertisement -