మహారాష్ట్ర సర్కార్- బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మధ్య వార్ తీవ్రస్ధాయికి చేరిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసులో ముంబై పోలీసుల తీరును తప్పుబట్టిన దగ్గరి నుండి మొదలైన జగడం ఇప్పుడు కంగనా ఆఫీస్‌ని కూల్చే వరకు చేరుకుంది.
దీంతో హైకోర్టును ఆశ్రయించిన కంగనా….కూల్చేవేతపై స్టే తెచ్చుకుంది. అంతటితో ఆగక ట్విట్టర్ ద్వారా మహా సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. త్వరలోనే తాను సీఎం ఉద్దవ్ థాక్రేపై ప్రత్యక్షంగా ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించారు. అయోధ్య, కశ్మీర్ నేపథ్యంలో సినిమాలు తీసి త్వరలోనే థాక్రేకు గుణపాఠం చెప్తానని చురకలంటించారు.తనపై అక్కసుతో తన బాంద్రాలోని ఆఫీస్ ని కూల్చారని ఆరోపించారు. తాను ఎటువంటి అక్రమకట్టడాలకు పాల్పడలేదని అన్నారు. శివసేనతో పోరాడుతున్నందువల్లే రాష్ట్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుంటోందని దుయ్యబట్టారు.
ముంబై పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లా కనిపిస్తుందని #deathofdemocracy అని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. బీఎంసీ బృందం ఫోటోలను యాడ్ చేస్తూ పాకిస్తాన్ మరియు బాబర్ మరియు అతని సైన్యం అని క్యాప్షన్ ఇచ్చింది. ఇవాళ మీ రోజు కావొచ్చు రేపు నాది న్యాయం గెలుస్తుందని పేర్కొంది కంగనా.