కంగనా తెగ తిప్పుతోంది..!

188
kangana Ranaut Practicing Sword Fight For Manikarnika
- Advertisement -

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం తన తాజా సినిమా ” మణికర్ణిక ..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ “తో ఫుల్‌ బిజీగా మారింది. ఇందులో బాగంగానే మూవీకోసం కంగనా తెగ కష్టపడుతోంది. జిమ్ లో ట్రైనర్ సాయంతో రెండు కత్తులను తిప్పుతూ ..మాంచి యోధురాలిలా కత్తిసాము చేస్తోంది.

 kangana Ranaut Practicing Sword Fight For Manikarnika

అయితే.. కంగనా రనౌత్ కసరత్తులు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు కత్తులను ఒకేసారి తిప్పుతూ కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగనాను చూడొచ్చు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఈ సినిమాలో కంగనా..ఝాన్సీ రాణి లక్ష్మీబాయి రోల్ పోషించడం విశేషం.

హాలీవుడ్ కు చెందిన నిక్ పావెల్ ఈ మూవీకి స్టంట్ డైరెక్టర్. సోనూ సూద్, అంకిత లోఖండే, వైభవ్ తత్వావాడి ప్రధాన తారాగణం. వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ప్రస్తుతం జైపూర్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. బహుశా హృతిక్ రోషన్ వివాదం నుంచి కాస్త సేద దీరేందుకు కంగనా రోజులో చాలాసేపు జిమ్ లోనే గడుపుతోందనే సెటైర్లు కూడా వినబడుతున్నాయి.

- Advertisement -