బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వరుస సినిమాలో దూసుకుపోతుంది. ఈ అమ్మడు వైవిధ్యబరితమైన పాత్రలను ఎంచుకుంటు విజయాలను సోంతం చేసుకుంటుంది. కంగనా ఇటీవల జడ్జిమెంటల్ హై క్యా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రశంసలు లభించాయి. ఇక ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవీ అనే చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. ఇదిలావుంటేస కంగనా తాజాగా ఓ తమిళ రీమేక్ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం.
ఆ చిత్రం ఏంటంటే.. గత కొద్దినెలల క్రితం తమిళంలో అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడై’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆమె’ టైటిల్‌తో ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమలా పాల్ చాలా వరకూ నగ్నంగా కనిపిస్తుంది. ఆమె చేసిన ఈ సాహసం అంతా ఆశ్చర్యపోయేలా చేసింది.
అయినా ఈ సినిమా అటు తమిళంలోగానీ, ఇటు తెలుగులోగాని విజయవంతం కాలేదు. అయితే ఈ తరహా కథను కొద్దిగా మార్చుకుంటే బాలీవుడ్ వారికి బాగా ఎక్కుతుందనే ఉద్దేశంతో, హిందీ రీమేక్ హక్కులను విక్రమ్ భట్ సొంతం చేసుకున్నాడట. ఈ పాత్రకి కంగన అయితే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.
అయితే, తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది కంగనా టీం. కంగన ప్రస్తుతం తమిళనాడు దివంగత సీఎం జయలలిత బయోపిక్‌లో మాత్రమే నటిస్తున్నారని, ఇతర కొత్త ప్రాజెక్టులేమీ కమిట్ అవ్వలేదని, ముఖ్యంగా ‘ఆడై’ రీమేక్‌లో ఆమె నటించడం లేదని కంగన టీమ్ స్పష్టం చేసింది.
నిజానికి ‘ఆడై’ హిందీ రీమేక్ మీద ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. హిందీలో ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాలని భావిస్తున్న మహేశ్ భట్.. త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశముంది. హిందీలోనూ రత్నకుమారే దర్శకత్వం చేస్తారని అంటున్నారు.