యంగ్‌ రెబల్‌స్టార్‌పై కంగనా కామెంట్స్‌..

289
- Advertisement -

బాలీవుడ్ లేడీ సూపర్‌ స్టార్‌గా కంగనా రనౌత్‌కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అమె తాజాగా నటించిన చిత్రం ‘మణికర్ణిక’ ఈ చిత్రం ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. కంగనా రనౌత్ మన యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ను ఓ రేంజిలో పొగిడేయడం విశేషం. ప్రభాస్‌తో కలిసి కంగనా తెలుగులో ‘ఏక్ నిరంజన్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

Kangana Ranaut

అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలో కంగనా చిన్న స్థాయి కథానాయిక మాత్రమే. కానీ గత దశాబ్ద కాలంలో ఆమె రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ మీద పొగడ్తలు గుప్పించిందామె. తనతో కలిసి నటించిన ప్రభాస్ ఇప్పుడున్న స్థాయికి తనకు ఆనందగా ఉందని చెప్పింది. ‘బాహుబలి’తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించాడని.. అతడి ఎదుగుదల చూస్తే తనకు గర్వంగా ఉందని కంగనా చెప్పింది.

‘ఏక్ నిరంజన్’ సినిమా షూటింగు సమయంలో మేమిద్దరం ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం .. ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్లం. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. ప్రభాస్‌తో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది .. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఇక టాలీవుడ్‌లో కలిసి నటించాలనుకునే మరో హీరో ఎవరని అడిగితే.. మహేష్ బాబు పేరు చెప్పింది కంగనా.

- Advertisement -