జోదా అక్బర్‌ సెట్స్‌లో మణికర్ణిక..

367
Kangana Ranaut
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం మణికర్ణిక..ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలకానుంది. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

భారీ బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్ నిర్మిస్తుండగా హృతిక్ రోష‌న్ న‌టించిన జోదా అక్బ‌ర్ చిత్ర సెట్స్‌లో మ‌ణికర్ణిక మూవీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని కంగ‌నా తెర‌కెక్కిస్తోంది. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు ఒకరే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో మణికర్ణికగా గర్జించింది కంగనా. అజాదీ అంటూ క‌ద‌నరంగంలో క‌ర‌వాలం ప‌ట్టి శ‌త్రు మూక‌ల‌ని గ‌డ‌గ‌డ‌లాడించిన మణికర్ణికగా హవభావాలను చక్కగా పలికించింది. ఈ చిత్రానికి సంగీత త్రయం శంకర్- ఎహసాన్- లాయ్ లు స్వరాలు సమకూరుస్తున్నారు. మొత్తంగా మణికర్ణికతో కంగానా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

- Advertisement -