మళ్లీ వార్తల్లో కంగనా!

26
- Advertisement -

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా. తాజాగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి పటీ చేస్తోంది కంగనా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాతే చేసిన కామెంట్స్ వివాదానికి కేరాఫ్‌గా నిలిచాయి.

గతంలో కంగనా రనౌత్ సినిమాల్లో బోల్డ్‌గా నటించిన ఓ ఫోటోను షేర్ చేశారు సుప్రియా. ఇలాంటి ఫోటోలతో హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ ప్రజలకు కంగనా ఏం సందేశం ఇస్తున్నారంటూ కామెంట్ చేశారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో వెనక్కి తగ్గిన సుప్రియా శ్రీనాతే …తన అకౌంట్ నుంచి ఎవరో ఆ కామెంట్లు పెట్టారని తెలిపారు.

ఇక కంగనా సైతం తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించానని తెలిపింది. అమాయక అమ్మాయి నుంచి ధాకడ్‌ సినిమాలో గూఢచారిగా.. మణికర్ణిక సినిమాలో దేవతగా.. చంద్రముఖి సినిమాలో దయ్యంలా.. రజ్జో చిత్రంలో వేశ్యగా చేశానని తెలిపారు. అయితే కొంతమందికి తనలో నెగటివ్ పాత్రలే కనిపించాయని…ఇది మహిళల పట్ల వారికున్న నిబద్దత అని కౌంట్ ఇచ్చింది.

Also Read:చక్కెర అతిగా తింటే.. ప్రమాదమే!

- Advertisement -