బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన మణికర్ణిక సినిమా ఇటివలే విడుదలైన విషయం తెలిసిందే. భారీ విజాయన్నిఅందుకున్న ఈచిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా ఈచిత్రం తెరకెక్కింది. మొదట దర్శకుడు ఈచిత్రానికి దర్శకత్వం వహించి ఇద్దరి మధ్యలో గొడవల కారణంగా మధ్యలోనే వదిలేశాడు. ఆతర్వాత కంగనా ఈమూవీకి దర్శకత్వం వహించింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది కంగనా. తన జీవితకథ ఆధారంగా బయోపిక్ ను తీయనున్నట్లు తెలిపింది.
ఈమూవీని కూడా తానే దర్శకత్వం వహించనున్నట్లు స్పష్టం చేసింది. తన జీవితం ఎలా ఉండేదో.. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా తెరకెక్కిస్తానని చెప్పింది. ‘నన్ను జడ్జ్ చేయకుండా నన్ను నాలా స్వీకరించి ప్రేమించేవారు నా చుట్టూ ఎందఱో ఉన్నారు. వారి కోసమైనా సినిమా తీయాలని అనుకుంటున్నానని” కంగనా స్పష్టం చేసింది. ఈచిత్రానికి కూడా కథను విజయేంద్రప్రసాద్ అందిస్తున్నట్లు తెలిపింది. హిమాలయాల నుంచి వచ్చిన ఓ అమ్మాయి.. బాలీవుడ్లో ఎలా ఓ ప్రముఖ హీరోయిన్గా ఎదుగుతుందన్న కథాంశంతో సినిమాను రూపొందించనున్నట్లు ఆమె చెప్పారు. తన జీవితంలో సహాయం చేసిన వారి దగ్గరనుండి అవమానించిన వారి వరకు అందరి గురించి బయోపిక్ లో ప్రస్తావించబోతున్నట్లు వెల్లడించింది.