తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు,తమిళ్‌లో తలైవి అనే టైటిల్ ఖరారు చేయగా హిందీలో ‘జయ’గా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇక ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించనుంది. ఇక సినిమాలో జయలలిత గెటప్ కోసం అమెరికాకు వెళ్లారు కంగనా. అచ్చం అమ్మలా కనిపించేలా గెటప్స్ ట్రై చేస్తోంది కంగనా. ఇందుకోసం హాలీవుడ్ ఎక్స్‌పర్ట్ జాసన్ కొలిన్స్ కష్టపడుతున్నారు.
ఈ సినిమాలో కంగనా నాలుగు గెటప్‌లలో కనిపించనుంది. జయలలిత సినీపరిశ్రమకు రాకముందు, ఆ తరువాత సినీపరిశ్రమలో బిజీగా వున్న సమయంలో, తరువాత రాజకీయ అరంగేట్రం చేసనప్పుడు. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఇలా నాలుగు గెటప్‌లలో కంగనను చూపించనున్నామని చెప్పారు నిర్మాత. దీపావళి తర్వాత ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.