నా ఇన్‌స్టా ఖాతాను హ్యాక్‌ చేశారు- కంగనా రనౌత్‌

217
- Advertisement -

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది ఈ అమ్మడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని కంగనా చెప్పారు. చైనా తన ఇన్‌స్టా అకౌంట్‌ను హ్యాక్ చేసిందని తెలిపారు.‘నిన్న రాత్రి చైనాకు చెందిన వారు నా ఇన్‌స్టా ఖాతాను హ్యాక్‌ చేసినట్లు అలర్ట్‌ వచ్చింది. తెల్లవారుజామున లేచి చూసేసరికి అలర్ట్‌లతోపాటు తాలిబన్ల గురించి నేను పెట్టిన స్టోరీ కనిపించలేదు.

మరో గంటకి నా అకౌంట్‌ కూడా మాయమైంది. వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా నా అకౌంట్‌ యాక్టివేట్‌ అయ్యింది. పోస్టు చేద్దామని ఏదైనా రాయబోతుంటే లాగ్‌ అవుట్‌ అవుతుంది. మా చెల్లెలి ఫోన్‌ తీసుకుని లాగిన్‌ అవుతున్న అలాగే జరుగుతుంది. ఇదంతా అంతర్జాతీయ కుట్రలో భాగం అనిపిస్తుంది అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది కంగనా.

- Advertisement -