అఖిల్‌ను అభినందించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..

128

హనుమకొండ జిల్లా నయీమ్ నగర్‌కు చెందిన రాసమల్ల అఖిల్ రష్యాలోని మౌంట్ ఎల్ బ్రూస్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల్‌ను అభినందించి సన్మానం చేశారు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మరియు యువతరానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని,అఖిల్ ఇంకా ఎన్నో పర్వతాలు అధిరోహించాలని దానికి నా సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.