మణికర్ణిక దర్శకురాలిని నేనే..క్రిష్‌పై కంగనా ఫైర్

292
kangana
- Advertisement -

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దర్శకత్వంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మణికర్ణిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మణికర్ణిక సినిమా విషయంలో దర్శకుడు క్రిష్,కంగనా మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

మణికర్ణిక మూవీని తానే డైరెక్ట్ చేశానని తాను తీసింది అలాగే ప్రేక్షకుల ముందుకువస్తే బంగారం అయిఉండేదని ఇప్పుడు ఉన్నది వెండి మాత్రమేనని కంగనాపై విమర్శలు గుప్పించారు క్రిష్ . ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించింది కంగనా. మణికర్ణిక సినిమాకు నేనే దర్శకత్వం వహించానని కుండబద్దలు కొట్టింది.

క్రిష్‌ ఇలా నన్ను ఎటాక్‌ చేయడం సరికాదు. ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే నిరూపించుకోమని చెప్పండి. మీడియాతో మాట్లాడితే ఆయనకు ఎటువంటి లాభం లేదని మండిపడింది కంగనా. నా పాత్రను తీసేశారు, కట్‌ చేశారు అని ఆరోపణలు చేసేవారు నన్ను చూసి నేర్చుకోవాలని సూచించారు కంగనా . ఓ నటిగా, ఫిల్మ్‌మేకర్‌గా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నా. వీటిని నేను నా స్వతహాగా సాధించా. మా నాన్న నాకివ్వలేదు. మీరూ ఇలాంటి స్థాయికి రండి అంటు చురకలు అంటించారని మరొకర్ని చూసి ఏడిస్తే.. ఫలితం లేదు అని ఘాటుగా స్పందించారు కంగనా.

- Advertisement -