- Advertisement -
ఎంపీల జీతంపై బీజేపీ ఎంపీ కంగన రనౌత్ సంచలన కామెంట్ చేశారు. నియోజకవర్గాలకు వెళ్లేందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని ఎంపీ జీతం సరిపోవట్లేదని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని ఒక్కో ప్రదేశం 300-400 కి.మీ.ల దూరంలో ఉండటమే అందుకు కారణమన్నారు.
రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవని …దీనివల్ల ఎంపీలకు వచ్చే జీతం సరిపోవట్లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని తెలిపారు.
Also Read:ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి
ప్రజలు తన వద్దకు పంచాయతీ స్థాయి సమస్యలను కూడా తీసుకొస్తున్నారని.. మీ సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ తరపున ఎంపీగా గెలిచారు కంగనా.
- Advertisement -

