కాంచన-3 బ్యూటీకి తప్పని లైంగిక వేధింపులు..!

730
kanchana 3 heroine

రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హార్రర్ కామెడీ కాంచన 3. ముని సీక్వెల్‌లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లారెన్స్ సరసన ముగ్గురు హీరోయిన్స్‌ నటించగా వీరిలో రష్యాకు చెందిన రి డిజావి అలెగ్జాండ్రా ఒకరు. భర్త పిల్లలతో కలిసి చెన్నైలోని ఎంఆర్‌సీ నగర్‌లో ఉంటున్న అలెగ్జాండ్రా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో లారెన్స్‌కు లవర్‌గా నటించింది.

ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అలెగ్జాండ్రాను ఫొటోగ్రాఫర్ రూపేశ్ సంప్రదించాడు. సినిమా ఇండస్ట్రీ పెద్దలతో తనకు సంబంధాలున్నాయని చెప్పి ఫొటో షూట్‌కు పిలిపించాడు.

Image result for alegjandra kanchana 3

అక్కడికి వెళ్లిన తర్వాత పలు భంగిమల్లో తన ఫొటోలు తీశాడని.. అనంతరం బెడ్‌రూమ్‌కు రావాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని అలెంగ్జాండ్రా ఆరోపించింది. తన లైంగిక వాంఛ తీర్చాలని…లేదంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో లీక్ చేస్తానని రూపేశ్ వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు రుబేశ్‌ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.