ఆగస్టులో బోయపాటి-బాలయ్య కాంబో..

293
Balakrishna Boyapati Srinu New Movie Launch Stills
- Advertisement -

బాలయ్య-బాలకృష్ణ కాంబినేషన్‌ అంటే వచ్చే కిక్కే వేరు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా,లెజెండ్ రికార్డు వసూళ్లను రాబట్టాయి. లెజెండ్ సినిమాతో అవార్డులను కొల్లగొట్టేశాడు బాలయ్య. తాజాగా వీరి కాంబోలో మరో సినిమా వస్తే..ఫ్యాన్స్‌కు పండగే.

గురువారం బోయపాటి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బాలయ్యతో తాను హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. ఆగస్టు రెండో వారంలో సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు. 2020 వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకురానుందని చెప్పారు.

బోయపాటి బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు ఎంతోమంది టెక్నీషియన్లు ఆయనకు అభినందనలు తెలియచేశారు.

- Advertisement -