కులాల మధ్య ‘కంచె’ రేపిన దుమారం అంతా ఇంతా కాదు. కంచె ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం తీవ్ర వివాదం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ కంచె పై సంబంధిత కులాల వారు ఫైర్ అవుతునే ఉన్నారు.
అయితే ఇదే విషయంపై తెలుగు రాష్ట్రాల్లో వివాదం చెలరేగుతున్న వేళ, ఓ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేలేక తెల్లమొహం వేశారు కంచెఐలయ్య.
తప్పు చేసిన వ్యక్తిని టార్గెట్ చేయకుండా ఓ కులాన్ని మొత్తాన్నీ కించపరిచేలా పుస్తకాలు రాయడం తప్పని ఒప్పుకుంటారా? అని పదేపదే అడిగినా, దానికి సమాధానం చెప్పలేక, తన తప్పును అంగీకరించలేని స్థితితో ప్రొఫెసర్ కంచె ఐలయ్య, విసురుగా లేచి వెళ్లిపోయారు.
తాను మొదటి నుంచి ఒకటే ప్రశ్న అడుగుతున్నానని, అందరినీ ఒకే గాటన ఎలా కట్టగలుగుతున్నారు? దీనికి మాత్రం సమాధానాన్ని మీరు చెప్పడం లేదు అని యాంకర్ అడుగగా, తాను రీసెర్చ్ చేసి బుక్ రాశానని మాత్రమే చెప్పారు కంచెఐలయ్య. అంతేకాకుండా “మొత్తం జ్యుడీషియరీకి వదిలిపెట్టండి. పోలీస్ వ్యవస్థకు వదిలిపెట్టండి. మీరు మరీమరీ ఇదే అడుగుతుంటే మాత్రం… ఐయామ్ గోయింగ్” అంటూ లేచి వెళ్లిపోయారు.