క్రైమ్ రేట్ తగ్గేలా పగడ్బందీ చర్యలు- ఎస్పీ

303
Kamareddy SP
- Advertisement -

కామారెడ్డి జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో 2020 క్రైమ్ రేట్‌పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కరోనా, లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్తుతుల్లో కూడా పోలీసు శాఖ నిరంతరం శ్రమించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆస్తి తగాదాలు, స్వంత కక్షలతో హత్యలు జరిగాయి. ఈ సంవత్సరం జరిగిన 28 హత్య కేసులలో 16 కేసులు కుటుంబ సభ్యుల మధ్య జరిగినవి. ఇళ్లలో దొంగతనాలు 2019లో 233 జరిగితే 2020లో 207 జరిగాయి. వీటిలో 50 శాతంకు పైగా నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడం జరిగింది. 203 కేసులలో 153 మందిని అరెస్ట్ చేయగా 29 మందికి శిక్ష ఖరారు అయిందని ఎస్పీ తెలిపారు.

ఇక ఈ సంవత్సరం 4 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవగా ఇందులో రెండు కేసులను ఘటన జరిగిన రోజే సీసీ కెమెరాల ద్వారా ఛేదించడం జరిగింది.నాలుగు కేసులలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లాలో జరిగిన 12 అత్యాచార కేసులలో ఎక్కువ శాతం 25 నుంచి 30 సంవత్సరాల వయసు మహిళలు ఉన్నారు. అలాగే రోడ్డు ప్రమాదలలో ఎక్కువగా స్వయంకృతాపరాధంతో జరిగినవే ఉన్నాయి. 2019లో 202 ప్రమాదాలు జరిగితే ఇందులో సొంత తప్పిదాల వల్ల జరిగినవి కాగా 2020లో 201 ప్రమాదాల్లో 126 మంది సొంత తప్పిదాల వల్ల జరిగినవి.

ఈ సంవత్సరం 173 మంది సాధారణ కారణాలతో చనిపోగా 323 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.ఆరోగ్య సమస్యలతో 23, ఆర్థిక సమస్యలతో 60, కుటుంబ కలహాలతో 122, ప్రేమ విఫలమై 98, ఇతర కారణాలతో 20 మంది చనిపోయారు. జిల్లాలో హెల్మెట్ ధరించని లక్ష 20 వేల 233 వాహనదారులపై కేసులు నమోదు చేశాం. జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటులో తాడ్వాయి మండలం ముందంజలో ఉంది.. ఈ మండలాన్ని మిగతా మండలాలు ఆదర్శంగా తీసుకోవాలి. తాడ్వాయిలో 18 గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది.

రామారెడ్డి మండలంలో 18 గ్రామాలకు 17 గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు పూర్తి చేశాం. కామారెడ్డి పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చాలా తక్కువగా ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి. జిల్లాలో 250 మందికి పైగా పోలీసు సిబ్బంది కరోన భారిన పడ్డారు. అయినా శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎక్కడ లోటు రాకుండా జాగ్రత్తలు వహించాం. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త స్కీముల పేరుతో వచ్చే వారిని నమ్మవద్దు. వచ్చే నెల నుంచి సైబర్ నెరాలపై ప్రజలకు ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పిస్తాం.జిల్లా పోలీసు శాఖలో అవినీతికి పాల్పడిన 45 మంది అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఉత్తమ సేవలు అందిస్తే రివార్డులు ఎలా ఇస్తామో తప్పు చేస్తే శిక్షలు కూడా అలాగే ఉంటాయని ఎస్పీ శ్వేతారెడ్డి హెచ్చరించారు.

- Advertisement -