‘కమల్‌కు అంతలేదు..రజినీనే నెక్ట్స్ సీఎం’

196
Kamal's Brother Predicts Next CM Of Tamil Nadu
- Advertisement -

జయలలిత మరణాంతరం తమిళనాడు రాజకీయాల్లో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే నటుడు రజినీ కాంత్‌, కమల్ హాసన్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే మధురై పబ్లిక్‌ మీటింగ్‌లో కమల్ హాసన్‌ తన పార్టీ పేరుని కూడా ప్రకటించడం జరిగింది. కాగా…రజినీ కూడా తన రాజకీయాలకు సాన పెట్టే పనిలో ఉన్నాడు.

 Kamal's Brother Predicts Next CM Of Tamil Naduఇదిలా ఉంటే తాజాగా కమల్‌ హాసన్‌ సోదరుడు చారుహాసన్ తమిళనాడు రాజకీయాలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి రజనీకాంత్ అని జోస్యం చెప్పారు చారుహాసన్‌. ఈ విషయాన్ని తన ఫేస్‌ బుక్‌లో పోస్ట్‌ చేశారు చారుహాసన్‌.

ఇక ఈ పోస్ట్ తమిళనాడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. తన సోదరుడు కమల్‌ హాసన్‌తో పోల్చుకుంటే.. సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు రజినీకే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా కమల్ ను ప్రజలు మంచి నటుడిగానే చూస్తారని, రాజకీయాల్లో మాత్రం అంత మద్దతు ఉంటుందని తాను భావించడం లేదని అన్నారు. కాగా, చారుహాసన్ ఆది నుంచీ రజనీకి మద్దతు పలుకుతున్నారు.

- Advertisement -