వామ్మో.. ఏంటిలా అయిపోయింది ?

38
- Advertisement -

కొందరు హీరోయిన్లు సడెన్ గా తమ లుక్ ను మార్చేస్తుంటారు. సైజ్ జీరో నుంచి బబ్లీ బ్యూటీగా మారిపోతుంటారు. ఇక మరికొందరు ఫిజిక్ ను మెయింటైన్ చేయలేక బాగా బరువు పెరిగిపోతుంటారు. ఐతే, హీరోయిన్ల లుక్ అనేది వారి కెరీర్‌ను కూడా డిసైడ్ చేస్తుంది. తాజాగా హీరోయిన్ కమలిని ముఖర్జీ లుక్ చూసి అందరూ షాక్ కి గురి అవుతున్నారు. అంత దారుణంగా ఉంది కమలిని ముఖర్జీ లుక్. ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలా కనిపించిన కమలిని ముఖర్జీ.. ఇప్పుడు బాగా బరువు పెరిగి.. చూడటానికి కూడా కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. పైగా పూర్తిగా బరువు పెరిగిపోవడం కారణంగా.. గుర్తు కూడా పట్టనంతగా మారిపోయింది కమలిని ముఖర్జీ.

అసలు కమలిని ముఖర్జీ ఇంతలా మారిపోవడానికి కారణం ఏమిటి ?, అలాగే బాగా బరువు పెరగడానికి కారణమేంటి..?, నిత్యం యోగా చేసే కమలిని ముఖర్జీ వెయిట్ ఎందుకు కంట్రోల్ లో పెట్టుకోలేకపోయింది. ఈ విషయాలనే ఆరా తీస్తున్నారు ఆమె అభిమానులు. వాస్తవానికి కెరీర్ మొదట్లో చాలా సన్నగా కనిపించింది కమలిని ముఖర్జీ. ఆనంద్, గోదావరి లాంటి సినిమాల్లో కమలిని ముఖర్జీ ను చూసి అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కాస్త బరువు పెరిగినా ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు.

ఆ మధ్య ఓ ఈవెంట్ లో కనిపించింది కమలిని ముఖర్జీ. బొద్దుగా ముద్దుగా మారిపోయింది. నిజానికి కమలిని ముఖర్జీ నటనకే కాదు.. గ్లామర్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, సడెన్ గా ఇలా వెయిట్ కంట్రోల్ తప్పింది. వెయిట్ పెరుగుతూనే ఉంది. మొత్తానికి తాజాగా కమలిని ముఖర్జీ లుక్ మరింత వైరల్ అవుతుంది. పూర్తిగా బరువు పెరిగిపోయిన కమలిని ముఖర్జీను చూసి అయ్యో పాపం అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.

అసలు ఇలా కమలిని ముఖర్జీను చూస్తామని వాళ్లు ఎప్పుడూ ఊహించి ఉండరు. కొన్ని రోజులుగా బయటికి రాని కమలిని ముఖర్జీ.. తాజాగా కనిపించి గుర్తు పట్టడానికి కూడా కాసేపు అయ్యేంతగా మారిపోయింది. అమ్మో ఏంటిలా అయిపోయింది అంటూ కమలిని ముఖర్జీ సన్నిహితులు కూడా షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -