- Advertisement -
అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. తొలి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకునేందుకు సిద్ధమవుతుండగా తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాదేవి హ్యారిస్ .. కరోనా టీకా రెండవ డోసు తీసుకున్నారు.
మోడెర్నా సంస్థకు చెందిన కోవిడ్ టీకా డోసులను కమలా తీసుకోగా అమెరికన్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె కోరారు. సీ-స్పాన్ టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న ఆమె.. టీకా మీ జీవితాలను రక్షిస్తుందని అన్నారు.
రోజుకు పది లక్షల మందికి టీకాలు వేస్తుండగా వంద రోజుల పాలన పూర్తి అయ్యేలోగా సుమారు పది కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
- Advertisement -