జైలు నుండి విడుదలైన చిన్నమ్మ..

152
sasikala
- Advertisement -

మాజీ సీఎం జయలలిత నెచ్చెలి,చిన్నమ్మగా తమిళనాట తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న శశికళ జైలు నుండి విడుదలయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన శశికళ..శిక్షా కాలం నేటితో పూర్తయింది. ఇప్పటికే శశికళ జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆమె రూ.10కోట్ల జరిమానా చెల్లించారు.

ప్రస్తుతం కరోనాతో బెంగ‌ళూరు విక్టోరియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు శశికళ. ఆమె విడుద‌ల‌కు సంబంధించిన ప్ర‌క్రియను ఆస్ప‌త్రిలోనే అధికారులు పూర్తి చేశారు. వైద్యుల‌తో చ‌ర్చించి డిశ్చార్జిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బంధువులు తెలిపారు. ప్ర‌స్తుతం శ‌శిక‌ళ ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని ఆస్ప‌త్రి వైద్యులు స్ప‌ష్టం చేశారు.

- Advertisement -