విలక్షణ నడుటు కమల్ హాసన్ డైరెక్షన్ లో ఆయనే కథానాయకుడి రూపొందుతున్న చిత్రం విశ్వరూపం2. విశ్వరూపం సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కుస్తున్నారు. తాజాగా విశ్వరూపం2 ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించగా.. తెలుగులో డబ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ట్రైటర్ ని జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేయగా..తమిళంలో ఆయన కూతురు శ్రుతి హాసన్, హిందీలో అమిర్ ఖాన్లు రిలీజ్ చేశారు.
‘నాజర్ ని బడికి పంపాలి. జలాల్ ను కాలీజ్ కి పంపాలి’ అన్న డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతోంది. ‘ఏ మతానికో కట్టుబడటం తప్పు కాదు బ్రదర్ దేహ ద్రోహం తప్పు’ అని కమల్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు.. రొమాన్స్ ను కూడా తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రంలో కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రియా జెరీమియాలు నటిస్తున్నారు. తమిళంలో వేణూ రవిచంద్రన్, హిందీలో ఏక్తా కపూర్‌లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
2013లో కమల్ విశ్వరూపం రాజకీయ అడ్డకుల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు కమల్ రాజకీయ రంగప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న విశ్వరూపం2 పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆగస్టు 10 ప్రేక్షకుల ముందుకు రానుంది.