- Advertisement -
అత్యంత భారీ బడ్జెట్ తో విలక్షణ నటుడు కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించిన సినిమా విశ్వరూపం. ఈ సినిమా సీక్వెల్ కి శ్రీకారం చుట్టి .. దాదాపుగా పూర్తి చేశాడు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది. తొలిభాగాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కిందని ఈ సినిమా కోసం కమల్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. నాలుగేళ్లుగా నానా తంటాలు పడుతున్నా విశ్వరూపం2 మాత్రం విడుదలకు నోచుకోలేకపోయింది.
అయితే ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో కమల్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే వున్నాడు. ఆ ప్రయత్నాలు ఫలించడంతో ఈ సినిమా విడుదలకి ఆటంకాలు తొలగిపోయాయని అంటున్నారు. కమల్ పుట్టినరోజైన ఈ నెల 7వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ఎన్ని వ్యూస్ ను తెచ్చుకుంటుందో సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
- Advertisement -