మీ అభిమానానికి థ్యాంక్యూ..

208
Kamal , Rajini to get AP govt’s Award
- Advertisement -

2014, 15,16 సంవత్సరాలకుగాను నంది పురస్కారాలతోపాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటులుగా బాలకృష్ణ (2014-లెజెండ్‌), మహేష్‌బాబు (2015-శ్రీమంతుడు), ఎన్టీఆర్‌ (2016-జనతా గ్యారేజ్‌, నాన్నకు ప్రేమతో) నంది పురస్కారానికి ఎంపికయ్యారు. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాలను 2014కి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌, 2015కి శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు, 2016కి ప్రముఖ నటుడు రజనీకాంత్‌లను కమిటీ ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రఘుపతి వెంకయ్య గారి పేరటి అవార్డు నన్ను వరించడం చాలా సంతోషంగా ఉంది. గౌరవప్రదమైన అవార్డు ఇది. ఆంధ్రప్రదేధ్‌ ప్రభుత్వానికీ, జ్యూరీకి నా కృతజ్ఞతలు. మిగతా విజేతలకు నా అభినందనలు అని తెలిపారు.

ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది, హృదయపూర్వక ధన్యవాదాలని రజనీకాంత్ ట్వీట్ చేశారు. తెలుగు తెరతో ఎంతో అనుబంధం ఉన్న కమల్ హాసన్ కూడా ఎన్టీఆర్ పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.

నాకు ఇంతటి గౌరవం ఇచ్చిన ఆంధ్రకు ధన్యవాదాలు అని కమల్ హాసన్ ట్వీట్ చేశాడు. మీ మద్దతుకు రుణపడి ఉంటాను. నా కెరీర్ ఆరంభం నుంచి మీ మద్దతు అపారం, కృతజ్ఞతలు, రజనీకి కంగ్రాట్స్ అని కమల్ ట్వీట్ చేశాడు. దీనికి రజనీకాంత్ బదులిస్తూ.. థ్యాంక్యూ కమల్ నీకు కూడా కంగ్రాట్స్ అని చెప్పారు.

శ్రీమంతుడు చిత్రంతో  మహేశ్‌ ఖాతాలో ఎనిమిది నందులు చేరాయి.మహేశ్‌తోపాటు ఆయన తనయుడు గౌతంకృష్ణ కూడా ఉత్తమ బాల నటుడిగా ‘1 నేనొక్కడినే’కు నంది అవార్డును అందుకోవడం.  నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్‌’ (2014) చిత్రానికి ఏకంగా తొమ్మిది నందులు వరించాయి. ఉత్తమ నటుడిగా ఎంపిక కావడమే కాకుండా ఉత్తమ చిత్రం, దర్శకుడు, సంభాషణ రచయిత, విలన్‌, ఫైటర్‌, నేపథ్య గాయకుడు విభాగాల్లో అవార్డులు లభించాయి. నటుడిగా బాలకృష్ణకు ఇది మూడో నంది.

- Advertisement -