యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందగా జూన్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. మే 31న హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. చీఫ్ గెస్టుగా ఎవరొస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది విక్రమ్.
ఈ ప్రాజెక్టులో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీ రోల్ చేస్తుండగా..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.