కమల్‌ పోటీ చేసే స్ధానంపై క్లారిటీ..!

168
kamal
- Advertisement -

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పొలిటికల్ వాతావరణం హీటెక్కిపోయింది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేతో బీజేపీ కూటమి కట్టగా డీఎంకే-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయనున్నాయి. ఇక కమల్‌ మరికొన్ని పార్టీలతో కలిసి మరో కూటమిగా బరిలోకి దిగనున్నారు.

ఇందులో భాగంగా మ‌క్క‌ల్ నీధి మయ్యం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ వ‌చ్చింది. గ‌తంలో ఎంజీఆర్ పోటీ చేసిన చెన్నైలోని అలంద‌ర్ స్థానం నుంచి క‌మ‌ల్ హాస‌న్ పోటీ చేసే అవ‌కాశాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మార్చి ఏడో తేదీన మ‌క్క‌ల్ నీధి మ‌య్యం పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేయ‌నుండగా ఏప్రిల్ ఆర‌వ తేదీన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

- Advertisement -