టీకా తీసుకున్న స్పీకర్,డిప్యూటీ స్పీకర్

39
padmarao

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సాధారణ ప్రజలకు కూడా కరోనా టీకా ఇస్తుండగా అవేర్‌నెస్‌లో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు టీకాలు వేయించుకున్నారు. ఇందులో భాగంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావుగౌడ్‌ కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు.నగరంలోని నిమ్స్‌ దవాఖానలో టీకా వేయించుకోగా, పద్మారావుగౌడ్‌ సికింద్రాబాద్‌లోని దవాఖానలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా రెండో విడుత వ్యాక్సినేషన్‌ ఈ నెల 1న ప్రారంభం కాగా రెండో విడతలో భాగంగా 60 ఏండ్లు పైబడినవారికి, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు.